Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోడి ధర తగ్గితే... గుడ్డు ధర మాత్రం కొండెక్కింది!

  • కార్తీక మాసం, దీక్షల కారణంగా తగ్గిన చికెన్ ధర
  • 25 నుంచి 30 శాతం ఉత్పత్తి తగ్గడంతో పెరిగిన గుడ్డు ధర
  • 7 రూపాయలైపోయిన గుడ్డు
కార్తీక మాసం, అయ్యప్ప, భవానీ దీక్షల కారణంగా చాలామంది భక్తులు, వారి కుటుంబ సభ్యులు ఇటీవల కొన్నాళ్ల పాటు మాంసాహారానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోడి మాంసం ధర కిందికి దిగింది. తిరుపతిలో కేజీ చికెన్ ధర వంద రూపాయలు కాగా, కోడి గుడ్డు ధర మాత్రం ఆకాశాన్నంటుతోంది. పేదవాడి పౌష్ఠికాహారంగా పేరొందిన గుడ్డు ధరకు రెక్కలు వచ్చాయి. గత కొంత కాలంగా నిలకడగా పెరుగుతున్న గుడ్డు ధర ఇప్పుడు ఏడు రూపాయలకు చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఆయితే.. కేజీ చికెన్ 150 రూపాయలు పలుకుతుండగా, కోడిగుడ్డు ధర 40 శాతం పెరిగి 7 రూపాయల నుంచి 7:50 పైసలకు చేరిందని భారత పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడు రమేశ్‌ కత్రి తెలిపారు. సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడమే గుడ్డు ధర పెరగడానికి కారణమని ఆయన తెలిపారు. మరికొన్ని నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, గుడ్డు ధర ఇప్పట్లో కిందికి వచ్చే అవకాశం లేదని ఆయన చెప్పారు. నష్టభయంతో రైతులు గుడ్ల ఉత్పత్తి తగ్గించారని, దీంతో 25 నుంచి 30 శాతం గుడ్ల ఉత్పత్తి తగ్గిందని, దీంతో గుడ్ల ధరలు పెరిగాయని ఆయన వెల్లడించారు.
egg
chicken
price hike

More Telugu News